కేష్నీ అరోరా 1983 బ్యాచ్ ఐ ఏ ఎస్ హరియానా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమిషనర్ గా ఆమె పేరు రికార్డుల్లో కెక్కింది హరియానా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన 25 సంవత్సరాలకు ఒక మహిళ డిప్యూటీ కమిషనర్ అయ్యారు తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు ఇంకో విశేషం ఏమిటంటే కేష్నీ కుటుంబంలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు చీఫ్ సెక్రెటరీలు అయ్యారు ముగ్గురిలో ఈమె చిన్న ఆమె అక్కలు మీనాక్షి ఆనంద్ చౌదరి (1969 బ్యాచ్) ఉర్వషి గులాటి (1975 బ్యాచ్ ) ఇద్దరూ ఈ పోస్ట్ లో పనిచేశారు.