నామ్ షబనా కోసం దాదాపు  ఏడాది పాటు సిద్దం అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ ప్రతి రోజు రెండున్నర గంటలు నేర్చుకున్నా అంటుంది తప్సీ. మొదటి నుంచి తప్సీ సినిమా చాయిస్ లు భిన్నంగానే వున్నాయి. ఆ విషయం గురించి చెప్పుతూ నటించాలని ఆలోచన వచ్చినప్పుడు పెద్ద బ్యానర్ ల నుంచి దక్షిణాదిలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత పింక్ దాకా నాకు సంతృప్తి లేనట్లే. సాఫ్ట్ వేర్ నుంచి గ్లామర్ ప్రపంచంలోకి వచ్చినందుకు నాకు నిరాశ ఏమీ లేదు. నటన నాకు స్పాంటేనియస్ గా వచ్చింది కానీ నటన లో ట్రైనింగులు ఏమీ తీసుకోలేదు. కానీ నటించడంలో నాకు ధ్రిల్ దొరకక చాలా సీరియస్ గా తీసుకున్నాను. నేను పోషించిన పాత్రలు చూసి నేను సీరియస్, స్ట్రాంగ్ అంటారు కానీ నాకు సరదాగా చేయడం చాలా ఇష్టం అంటుంది తప్సీ.

Leave a comment