కొన్ని అధ్యాయినాలు మనల్ని ఎలర్ట్ చేస్తాయి. మనం చేసే చిన్ని అశ్రద్ద వళ్ళ కలిగే నష్టాన్ని గురించి హెచ్చరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన అధ్యాయినం రిపోర్టు ఏం చెప్పుతున్నారంటే, పోశాకాహార లోపాలు ఆలోచనల అస్పష్టతకు కారణం అవుతాయని సమాచారం. మెదడు చక్కగా పనిచేయాలంటే ఇనుము పాత్ర కీలకం. మెదడుతో సహా ధాతువులు అన్నింటికీ ఆక్సిజన్ కొని పోయే ఐరనే. ఈ ఐరన్ లోపం వల్లనే నీరసం, మతిమరుపు ఏకాగ్రత తగ్గడం ఏ విషయం పైన ఎక్కువ సేపు మనసు నిలుప లేకపోవడం జరుగుతాయి. చిన్న పిల్లలు చాక్ పీస్, మట్టి, కాగితాలు తింటుంటే ఐరన్ లోపం అని గుర్తించ వచ్చు . ఎన్నో ఆహార పదార్థాలు, పప్పు ధన్యాలు, పాలకూర గింజలు, చికెన్, మిరపకాయలు, టమాటాలు, యాపిల్స్ , ఎరుపుదనం వుండే పండ్లు అన్నింటిలోను ఐరన్ వుంటుంది. మెదడుకు శక్తి నిచ్చే ఐరన్ ను ఆహారం ద్వారానే తీసుకుంటే ఆరోగ్యం.
Categories