Categories
గుజరాత్ కు చెందిన 42 ఏళ్ల నీతా పటేల్ ను వాటర్ ఛాంపియన్ గా పిలుస్తారు.గుజరాత్లోని మోగ్రవాడి కి చెందిన నీతా పటేల్ జీవితంలో నిలబడేందుకు విద్యే మార్గమని నమ్మారు.బారుక్ జిల్లాలోని ఒక గ్రామంలో ‘అగాఖాన్’ గ్రామీణ కార్యక్రమంలో భాయగమయ్యాక నీటి కోసం మహిళలు పడే ఇక్కట్లు తెలిసాయి. ఆదివాసి గ్రామీణ మహిళలను చైతన్యం చేసి నీటి సంరక్షణ పై అవగాహన కల్పించారు. వరద నీటిని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యామ్ లు,ఎత్తిపోతల పథకాలు ఎన్నో నిర్వహించి 12 సంవత్సరాల పాటు అలుపులేకుండా కృషి చేసి వందల గ్రామాలకు నీటి కొరత తీర్చి నీతా పటేల్ నిజమైన వాటర్ చాంపియన్. ఆమె సంకల్పబలంతో 230 గ్రామాల్లో 22 వేల కుటుంబాలు నీటి సమస్య నుంచి విముక్తి పొందాయి.
|
|