ఇంజనీరింగ్ చదువుకొంటున్న 21 సంవత్సరాల అనామిక శర్మ స్కై డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది. ఈ సంవత్సరం దుబాయ్ డ్రాప్ జోన్ నుంచి ఏ కాటగిరి ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది. ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళలే ఈ లైసెన్స్ పొందారు.మొదటి సారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు పదకొండేళ్లు ఆ తర్వాత 42 జంప్ లు సాధించిన ఘనత ఆమెదే. పది రకాల పారాచూట్ ఆరు వేర్వేరు ఎయిర్ క్రాఫ్ట్స్ ను సమర్థవంతంగా నడపగలిగింది అనామిక.

Leave a comment