Categories
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్ గా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన తొలి మహిళగా ఆమె వార్తల్లో నిలిచారు సాధన సక్సేనా. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కు ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ గా పని చేసిన మొదటి మహిళ కూడా ఆమె. పూణేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్య రికార్డ్ లతో డిగ్రీ తీసుకున్నారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా విశిష్ట సేవా పతకం పొందారు. ఆమె కుటుంబంలో మూడు తరాల వారు గత ఏడు దశాబ్దాలుగా దళాలలో పనిచేశారు.