Categories
బిజినెస్ ఫిలాంత్రఫీ రంగాల్లో సేవలు అందించిన ఉమెన్ వయోనార్ గా 2023 లో గుర్తింపు పొందారు సుధా రెడ్డి. కృష్ణా జిల్లా ఉయ్యూరు లో పుట్టి పెరిగి మైక్రోబయాలజీ చదువుకొని ఫ్యాషన్ రంగం వైపు వెళ్ళింది సుధా. మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ గ్రూప్ డైరెక్టర్ భారత్ లోని విశేషమైన నగల డిజైన్లు గుర్తించి స్థానిక నగలను ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చే ప్రయత్నం లో పలు అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొన్నారు. వ్యాపారం,సేవ ఫ్యాషన్ రంగాల్లో చేసిన సేవలకు యంగ్ ఇండియన్ ఉమెన్ అచీవర్స్ అవార్డ్ అందుకున్నది సుధా రెడ్డి. ఫ్యాషన్ రంగంలో సుధా కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.