కొత్తిమీర లో ఉండే ఖనిజ లవణాలు ఐరన్ మొదలైనవి సౌందర్య చికిత్సలో ఎంతో మేలు చేస్తాయి. పెదవులు నల్లగా ఉంటే రోజూ రాత్రి పడుకునే మందర కొత్తిమీర రసం రాస్తే పెదవులు సంతరించుకుంటాయి. మొటిమలు మంగు మచ్చలు చర్మం పై నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటే చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే కొద్ది రోజులలో చక్కని ఫలితం కనిపిస్తుంది విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ -సి లోపం తలెత్తకుండా ప్రతిరోజు తాజా కొత్తిమీర రసం తాగాలి ఈ రసం చర్మాన్ని అందంగా కూడా ఉంచుతుంది.

Leave a comment