బైక్ రిపేరింగ్ నాకు ఆత్మవిశ్వాసం ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్ని ఇచ్చింది. పనే దైవం అనుకున్నాను ఆ దైవమే దారి చూపింది అంటుంది బైక్ మెకానిక్ ఇంద్రావతి . మధ్యప్రదేశ్ లోని మందుల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు సాధారణ కూలీ పని చేసే వాళ్ళు. కొడుకు మనోజ్ చేసే ఉద్యోగం వారికి ఆధారం. మనోజ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం ఇష్టంగా నేర్చుకున్న బైక్ రైడింగ్ తో దాన్నే వృత్తిగా మలుచుకుంది ఇంద్రావతి. నెమ్మదిగా బైక్ రిపేరింగ్ నేర్చుకుంది ఒక వర్క్ షాప్ మొదలుపెట్టింది. ఇప్పుడు పేదింటి అమ్మాయిలకు బైక్ రిపేరింగ్ నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపెడుతోంది. నారాయణ్ గంజ్ లో ఆమె ప్రారంభించిన షాప్ ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలను బైక్ మెకానిక్ లను చేస్తోంది.

Leave a comment