సమాజం గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించడం, అవసరంలో ఉన్నవారికి సాయపడటం సామాజిక భాద్యత. కాకినాడలో ఉన్న కొందరు గృహిణులు ‘ తపన హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించారు. కొన్ని సంస్థలను కలిశారు. అక్కడ వుండే పిల్లలకు, టీచర్లకు ఎన్నో రకాల సాయాలు చేస్తారు. పిల్లల కోసం పుస్తకాలు కొంటారు, భోజనాలు పెడతారు. టీచర్స్ కు ఇంకొంత జీతం ఇస్తారు. మానసిక వికలాంగుల పాఠశాలకైతే చాలా అందిస్తారు. పది మందీ పది చేతులు వేసి వికలాంగులకు చక్రాల కుర్చీలు, విస్తరాకులు కుట్టే యంత్రాలు వంటివి అందిస్తారు. ఈ సంస్థలో వంద మంది సభ్యులున్నారు. బంధు మిత్రుల సాయంతోనే విరాళాలు పోగు చేసి చేతనైన సాయం చేస్తూ సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నారు.

Leave a comment