పిల్లలు అచ్చం మన స్టాంపుల్లాగా వుండాలని మనం ఎలా అనుకుంటామో వాళ్ళు అచ్చం మన లాగే వుండాలని అనుకరించాలని చూస్తారు. ఈ వీక్ పాయింట్ పట్టుకొన్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఏడాది పాపాయి దగ్గర నుంచి పది, పదిహేను ఏళ్ళ వయస్సు వరకు తల్లి కూతుళ్ళకు ఒకే లాంటి డ్రెస్సులు కుట్టేస్తున్నారు. చీరలు, లేహంగా ఒణిలు, చుడీదార్ల తో పాటు కొత్తగా వస్తున్న అన్ని రకాల డ్రెస్సులు అమ్మకు, పాపకు మ్యాచ్ అయ్యేలా వస్తున్నాయి. మాచింగ్ అంటే కేవలం రంగు ఒక్కటే కాదు. ఇద్దరికీ ఒకే రకం క్లాత్ తో ఒకే డిజైన్ తో వస్తున్నాయి. అమ్మ లాగే పాపాయి కూడా తయ్యారైతే అమ్మకీ ముచ్చటే. పాపకి సంతోషమే అన్నింటిలోను అమ్మని అనుకరించుకునే పాప అమ్మ లాంటి డ్రెస్ వేస్తె ఎంజాయ్ చేయరా? మరి ఈ మాచింగ్ ఫ్యాషన్ డ్రెస్సుల ఇమగెస్ చూసేయండి.

 

Leave a comment