ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 తర్వాత ఐటీ ఐటీ సంబంధిత రంగాల్లో మొదలైన ఉద్యోగుల కుదింపు ప్రభావంతో ఈ రంగంలో సంబంధం ఉన్న కంప్యూటర్ సైన్స్ ఎలెక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వంటి ఇంజినీరింగ్ కోర్టుల వైపు అమ్మాయిల రాక తగ్గుతోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా వున్నా తమిళనాడు లోనే ఈ సంఖ్య 3.4 శాతం తగ్గు ముఖం పట్టిందిట. ఇక ఇప్పుడు ఈ రిజర్వేషన్ కేటాయింపులో ఒక్క ఐటీ ని పక్కన పెట్టినా మెకానికల్ సివిల్ కెమికల్ విభాగాల్లో అమ్మాయిల రాక పెరగొచ్చని భావిస్తున్నారు.
Categories