ఒక్కసారి ఫ్యాషన్ లు కూడా ప్రాణం మీదికి తెచ్చిపెడతాయి చూసుకొండి అంటున్నారు డాక్టర్లు. శరీరాకృతి చక్కగా కనిపించేందుకు బిగుతుగా అతుక్కునేలా ఉండే డ్రెస్ వేసుకోటం వల్ల చర్మం రాపిడికి గురై ఎలర్జీలు వస్తాయి. బిగువైనా ఫ్యాంట్లు స్కర్ట్ లు ,లెగ్గింగ్స్ వంటివి క్లోజ్ ఫిట్టింగ్ స్కర్ట్ లు వేసుకోవడం వల్ల కండరాలు నొప్పులు ,డిస్క్ సమస్యలు రావచ్చు . అలాగే ఎత్తు చెప్పులు కూడా ఎక్కువసేపు మడమలపైన, వేళ్ల పైన భారం పడితే రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు వస్తాయి. వీటివల్ల మోకాళ్ళపై వత్తడి పెరిగి కీళ్ళనొప్పులు రావచ్చు . అటు తర్వాత శాశ్వతంగా వీటికి వైద్యం చేయించుకొంటూనే ఉండవలసి వస్తుంది.

Leave a comment