బెంగుళూరు మైసూరు సిల్క్ లతో పాటు టన్సర్  సిల్క్ కుడా    మహిళలు మెచ్చే జాబితాలో వున్నాయి. బగల్పూరీ పట్టుగా పిలిచే ఈ టన్సర్  సిల్క్ బీహార్ లోని భగల్పూర్ లో తయ్యారవ్వుతాయి. అద్దకం శైలి తో నేసే ఈ చీరలను కొసాసిల్క్స్ అని కుడా అంటారు. పట్టు పురుగు లోని కొన్ని జాతుల ను వీటి తయ్యారీలో వుపయోగిస్తారు. చైనా, ఇండియా, జపాన్, శ్రీలంకల్లో ఎన్నో రకాల టన్సర్  సిల్క్ చీరలు  తయ్యారవ్వు తాయి. పట్టు  పురుగులను చంపకుండా అహింస సిల్క్స్ పేరుతో తయ్యారయ్యె టన్సర్ చీరలకు చాలా డిమాండ్ వుంది. ఈ వస్త్రాలను డ్రై క్లీనింగ్ చేయించవలసిందే. ఈ సిల్క్ కు గాలి తగలడంఅలా అవసరం. ఒక్క వేళ ఇంట్లో    వీటిని శుబ్రం  చేయదలుచుకుంటే చల్లని నీళ్ళు, తేలికైన సందర్భంలో అయిన చాలా బావుంటుంది.

Leave a comment