మోడ్రెన్ ఫ్యాషన్ లో కూడా పాపిడి బిళ్లకు మంచి స్థానమే ఉంది. ఆధునిక వస్త్రధారణ లోనూ పాపిడి బిళ్ళ సింపుల్ గా ఇమిడిపోయింది. రవ్వల గాజులు,మణిహారాలు బంగారు లోలాకులు,వడ్డానం ఎన్ని నగలు ధరించినా కళ్ళను ఆకట్టుకునేది పాపిడిబిళ్ళే. పెళ్ళికూతురికి అందాన్ని రెట్టింపు చేసేది ఇదే ఈ మధ్యకాలంలో వైరల్ అయిన వీడియో లో ఆలియాభట్ పెళ్లి లో పెద్ద పాపిడి బిళ్ళ తో ముస్తాబయింది. భారతీయ సంప్రదాయంలో పాపిడి బొట్టు ఓ భాగం. ఉత్తర భారతదేశంలో వీటిని ‘మాంగ్ టీకా’ అంటారు. బంగారంలో రవ్వలు, పగడాలు రాళ్ళు పొదిగిన పాపిడి బిళ్ళలు వేడుకలను బట్టి ఎంచుకోవచ్చు.

Leave a comment