నేను ప్లస్ సైజు మోడల్ నే కానీ ఫెయిర్ నెస్ వెయిట్ లెస్ కలరింగ్ ఉత్పత్తులకు పని చేయను. నలుపు, లావు, మొటిమలు స్ట్రెచ్ మార్క్స్ వంటివి సహజమైనదే కదా వాటికి సంబంధించిన యాడ్స్ కు కూడా పని చేయను అంటోంది వర్షిత తటవర్తి. అంతర్జాతీయ డిజైనర్ సవ్యసాచి పరిచయం చేసిన ఈ ప్లస్ సైజ్ మోడల్ వర్షిత అమెజాన్, ఫ్యాషన్ మింత్ర, గార్నియర్ వంటి ఫ్యాషన్ బ్యూటీ లగ్జరీ బ్రాండ్స్ కు పని చేసింది. కత్రినా బ్యూటీ సంస్థ కె బ్యూటీ యాడ్ తో కత్రినా తో కలిసి నటించిన అనుభవం ఉంది. రంగు, రూపం అనే మన బలాలు వాటిని చూసి గర్వ పడటం మొదలు పెడితే సక్సెస్ మన చేతికి వచ్చినట్లే అంటుంది. వర్షిత ఇప్పటికీ ఇంత లావుగా ఉన్నా నువు మోడల్ ఏంటి అనే వారున్నారు కానీ అందానికి ప్రమాణాలు లావు,రంగు,ఎత్తు కాదు అంటుంది వర్షిత.

Leave a comment