కాశ్మీర్ లో బహిరంగంగా వేదిక పైన ఒక అమ్మాయి పాట పాడటం మామూలు విషయం కాదు. కానీ కాశ్మీర్ లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది అంటే దానికి ఎంతో ధైర్యం కావాలి. కుటుంబ ప్రోత్సాహం తో ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నో దేశాల్లో తన పాటలు అమృతాన్ని పంచింది షాజియా. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డు భక్తి మెమోరియల్ కమిటీ అవార్డ్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ వంటివి ఎన్నో అవార్డులు అందుకున్న షాజియా సూఫీ గీతాలతో పాటు హిందూ భక్తి గీతాలు అద్భుతంగా పాడగలదు. కాశ్మీర్ సాంప్రదాయ జానపద గీతాలు ఎంతో మధురంగా పాడగలదు షాజియా.

Leave a comment