బ్యాగిల్ డిజైన్స్ కోసం ఆన్ లైన్ లో వెతికితే వందలాది మోడ్రన్ డిజైన్లు కనిపిస్తాయి. వాటిలో బంగారు వజ్రాలు ప్లాటినంతో మొదలుపెట్టి గోల్డ్ సిల్క్ థ్రెడ్ తో రంగు రాళ్ళు కూర్చిన అందమైన గాజులు కనిపిస్తాయి. వేసుకునె డ్రెస్ లను బట్టి అమ్మాయిలు ఎన్నో రకాల గాజులను ధరిస్తూ ఉంటారు ఈ గాజులు ధరించే సంప్రదాయం ప్రాచీనకాలం నాటిదే. ఏనుగు దంతం,లోహాలు, మెటల్,ఇత్తడి,వెండి,రబ్బరు, ప్లాస్టిక్ వంటి ఎన్నో రకాల పద్దార్ధాలతో గాజుల తయారి జరుగుతుంది. వీటికి హైదరాబాద్ ప్రత్యేకం రాళ్ళ గాజులు ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణ గానే ఉంటున్నాయి. చేతికి వేసుకునే గాజులు చేసే శబ్దం కూడా ఆ గాజులు ధరించిన యువతి మస్థత్వం చెప్పేవాళ్ళట. ఎక్కువ శబ్దం వసే ఆమె లోతైన ఆలోచన చేస్తుందని చిన్నగా మోగితే ఆమె అనుకూలవతిగా ఆమె అన్నిటికి సర్ధుకుపోగలదని చెబుతున్నారు.