ఇప్పుడు వస్తోంది కలంకారీ ఫ్యాషన్, సారె చీరలు,కలంకారీ అంచులు సేమ్ బ్లౌజులు ఇవన్ని ఫ్యాషన్ ట్రెండ్.  కలంకారీలో మాత్రమే కనిపించే చిక్కని, చక్కని రంగులు హంసలు, నెమళ్ళు పువ్వులు, గుళ్ళు ఇవ్వన్ని అన్ని రకాల వస్త్రశ్రేణిలో ప్రత్యక్ష్యం అవుతున్నాయి. జీన్స్ ,చూడీదార్ అందమైన కలంకారీ వర్ణాలలో కనువిందు చేస్తున్నాయి.  జీన్స్ ఫ్యాంట్ పైన కలంకారీ షర్ట్ ఎంతో అందంగా అదిరిపోతుంది. జీన్స్ ,చూడీదార్ పై కలంకారీ జాకెట్ చమ్కీ కాంభినేషన్ కలంకారీ అనార్కలి సాదా లెగ్గింగ్ అలల్లో కదిలే కుచ్చిళ్లు కలంకారీ లెగ్గింగ్ చూడముచ్చటే. రాబోయో వేసవిని ఆహ్వానించేందుకు వార్డ్ రోబ్లో నింపేయచ్చు కలంకారీ వర్ణ సౌదర్యంతో.

Leave a comment