నీహరికా, వదిలించుకోవల్సిన విషయాలు చాలా ఉంటాయి తెలుసా జీవితంలో అన్ని పట్టించుకోవటంలో అర్ధం లేదు. ఎప్పుడు ఏది వదిలెయ్యాలో అది వదిలెయ్యాలి.  రోజులో ఎన్ని గంటలు ఎలా గడుపుతున్నామో ఒక్క రోజు పేపర్ పైనా రాసుకుంటే వృధా చేస్తున్న సమయంఎంతో తెలుస్తుంది. టీవీ చానల్స్ మారుస్తూ, ఫోన్ లో సంభాషనలు కొనసాగుస్తూ ఇంకొంత ఫేస్ బుక్, వాట్సాప్ వీటన్నింటితో గడుపుతున్న సమయం ఎంతవీటితో పాటు సమయాని విలువగా వాడిన నిమిషాలు ఏమైనా ఉన్నాయా, మంచి పుస్తకం చదవటం, చక్కని పాట వినడం కొత్త భాషా నేర్చుకోవడం ఇల్లు సర్ధుకోవటం లేదా సెప్ఫ్ లో చిందరవందరగా పడిన వాటిని సరిగ్గా పెట్టుకోవడం అయినా చేశామా అని ఆలోచించుకోవాలి. నిమిషం విలువను తెలుసుకుని ఆ నిమిషాన్ని ఖర్చు చేయటంలో ఉంది అసలైన తెలివి.

 

Leave a comment