ఏమరుపాటుగా ఉంటే డెబ్బై శాతం ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుంటారు.జాగ్రత్త ఎంతో శ్రద్ధగా ఉండండి అంటూ టెలివిజన్ లో మాట్లాడింది జర్మన్ ఛాన్స్లర్ ఏంజెల్ మెర్కెల్ .ఆమె ఎప్పుడూ ఏడాదికి ఒక్కసారే జాతినుద్దేశించి ప్రసంగించేది గత పదిహేను సంవత్సరాలుగా అదే అలవాటు కొనసాగిస్తోంది కానీ ఆమె సైంటిస్ట్ కావటంతో కరోనా తీవ్రతను ముందుగానే పసిగట్టిన వెంటనే చర్యలు తీసుకున్నది.పిల్లలకు హితబోధ చేసే తల్లిలాగా ఆమె మాట్లాడటం జర్మనీ ప్రజలు శ్రద్ధగా విన్నారు.చక్కగా పాటించారు మహమ్మారిని కట్టడి చేయడంలో చుట్టుపక్కల దేశాలకన్నా జర్మనీ ముందుంది.ఏంజెల్ మార్కెల్ ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ ప్రేమ ఇందుకు కారణం.