ఫ్లవార్ వాజుల్లో అందమైన పువ్వుల గుత్తులు పెట్టుకోవడం మనకు అలవాటే. అన్ని పువ్వులు అందులోనే పెట్టేస్తాం. కాని ఇంటర్ కనెక్టడ్ బడ్ వేజస్ లేదా మల్టీ వేజస్ లో ఒక పువ్వును ఒక దాన్లో పెట్టుకోవచ్చు. కొన్ని రెమ్మలు కొన్నీటిలో పువ్వులు కొన్నింటిలో పెట్టేయవచ్చు. పరీక్ష నాళికల్లాగా , చిన్ని గాజు కూజాల్లాగా ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటాయి. తీగల్లాంటి వాటిలో కొన్ని వరసలు కలిపి కట్టేసినవి ఉంటాయి. ఒక వేజ్ లో నీళ్ళు పోస్తే మధ్య గొట్టం ద్వారా అన్నింటికి చేరతాయి. గోడకు వేలాడిదీసే మల్టీ బాడ్ వేజస్ లో ఉన్నాయి. అసలే పువ్వుల అందం దానికి తోడు విభిన్నంగా ఉండే ఈ ఫ్లవర్ వాజులు కొత్తందం.