మహారాష్ట్ర లోని చందాపూర్ లో పిల్లలు ఆస్పత్రిలో వైద్యుడు మా అబ్బాయి డాక్టర్ ప్రియదర్శన్. ఒళ్ళంతా గాయాలతో ఉన్న పసికందును కాపాడాను ఆ పాపను తీసుకువెళ్లే వాళ్ళు లేరు ఏం చేయాలో తోచటం లేదు అన్నాడు. అప్పుడా ఆ పాపను నేను తెచ్చుకున్నాను కానీ ఆ పాప అనాధ అని నిరూపించే పత్రాలు లేక నాకు పెంపకానికి ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుపోయారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుని ఆ పాపను తెచ్చుకొన్నాను అప్పుడు ఇలాంటి పాపాల కోసం కిల్ బిల్ అనాధాశ్రమం ఏర్పాటు చేశాను అంటారు రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రభావతి ముథాల్. గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆ కిల్ బిల్ లో మూడు వందల మంది అనాధ పిల్లలు పెరిగి చదువుకొని  ఉద్యోగస్తులయ్యారు. ఎనభై ఆరేళ్ల ప్రభావతి తన కొడుకు డాక్టర్ ప్రియదర్శన్ సాయంతో ఇప్పటికీ పిల్లల ఆలనాపాలనా చూస్తారు.

Leave a comment