Categories
ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు గెలిచింది బాక్సర్ మేరీకోమ్. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెల్చుకొన్న బాక్సర్ ముగ్గురు పిల్లల తల్లి. నా భర్త పిల్లల సహాకారంతో నా కెరీర్ నెట్టుకొచ్చాను ,ఇన్ని బాధ్యతలు .టోర్నీ ఉన్న లేకున్న రోజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాను. డెలివరీ అయినా రెండు సార్లు 65 కేజీలు పెరిగి మళ్ళీ నేను పోటీ పడవలసిన బరువు 48 కేజీలకు వచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లే జీవితంలో నిర్ణయాలు తీసుకొవటంలో పనులు చేయటంలో అంతే చురుగ్గా ఉంటాను అంటోంది మేరీకోమ్. ఖాళీగా ఉండి కూడా సమయం లేదు ఏమీ చేయలేక పోతున్నాము అనే వాళ్ళకు ఈమె స్ఫూర్తి.