Categories
ఉదయాన్నే సొరకాయ రసం తాగితే బరువు తగ్గిపోతారని చాలామంది భావిస్తున్నారు కాని దీనికి క్లీనికల్ పరిశోధనలతో పని లేదు. ఐతే కొద్దిపాటి బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటే ఈ సోరకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో 96.1 శాతం నీరే ఉంటుంది. వంద గ్రాముల సొరకాయ ముక్కలో పన్నెండు క్యాలరీలు ఉంటాయి. ఇందులో పీచు ఎక్కువ ఉంటుంది. సీ విటమిన్ , బీ కాంప్లెక్స్, ఐరన్, సోడియం,పోటాషియం వంటివి సోరకాయలో అత్యధికంగా దొరుకుతాయి. రెగ్యూలర్ భోజనంలో సోరకాయ వాడకం కూడ ఆరోగ్యమే.