Categories
ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు భోజనం సరిగ్గా సమయానికి అందటం కష్టమే. ఆఫీస్ సమయాలు ఒక్కసారి తినేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు. భోజనం అంటే రొట్టెలు, అన్నం, కూర, పప్పు, పెరుగు అనుకోవద్దు అందుబాటులో ఉన్న ఏ ఆహారమైనా ఎంచుకోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్. రొట్టె, పప్పు, మజ్జిగ పర్వాలేదు. అరటి, యాపిల్, జామ, కమల, ద్రాక్ష, వేరుశెనగపప్పు మొదలైనవి తీసుకోవచ్చు. బయట లభించే సమోసాలు, స్వీట్లు, బేకరీ ఫుడ్ కంటే మొలకెత్తిన గింజలు తిన్నా మంచిది అంటారు. రోజంతా ఏమీ తినకుండా ఇంటికి వెళ్లగానే ఎక్కువ మోతాదులో తినడమే ప్రమాదం. దానికి బదులు రోజంతా రెండు గంటలకు ఓ సారి పండ్లు, మజ్జిగ అయినా తీసుకోండి అది ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.