Categories

యుద్ధంలో వీరమరణం పొందిన వీరులకు ఇచ్చే అశోక చక్ర అందుకున్న తొలి మహిళ నీర్జా భానోత్ చండీగఢ్ లో జన్మించిన నీరజ ఫ్లైట్ అటెండెంట్ గా పని చేసేది. 1986 సెప్టెంబర్ 5 ముంబై నుంచి అమెరికా వెళ్లే విమానంలో విధులు నిర్వహిస్తోంది నీర్జా తీవ్రవాదులు దాన్ని హైజాక్ చేసి 380 మంది ప్రయాణికులను బంధించారు ఆ ప్రయాణికులను వేరే మార్గం ద్వారా బయటకు పంపి కాపాడిన నీర్జా ఆ క్రమంలో ప్రాణాలు వదిలింది ఆమె ధైర్య సాహసాలకు గాను అశోక చక్ర అందింది.