Categories
ప్రసవం అయిపోగానే పెరిగిన శరీరం చూసుకుని డైటింగ్ ప్రారంభిస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ముందుగా తల్లులకు పాపాయి సంరక్షణ ఉంటుందు. బాలింతలకు మాంసకృత్తులు,విటమిన్లు,ఖనిజాలు అందితేనే తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో ఒమేగా 3 ఫ్యాట్ ఆమ్లాలు ఉండే సాల్మన్ ట్యూన్ చేపలు, చికెన్, బీన్స్, చిక్కుడు జాతి గింజలు,ఇనుము, క్యాల్షియం,పీచు సంక్లిష్ట పీచు పదార్ధాలు అందేలా చూసుకోవాలి. పాలిచ్చే తల్లికి విటమిన్ సీ అందేలా నిమ్మ,నారింజ,బత్తాయి వంటి పండ్లు తినాలి. గుడ్డు పచ్చ సొనలో విటమిన్ డీ ఉంటుంది. కనుక దీని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ పోషకాలు అందితేనే తల్లి,బిడ్డ క్షేమంగా ఉంటారు.