Categories
వంకీలు ,వడ్డానాలు ఒకప్పుడు పెళ్ళి కూతురి ఆభరణాల్లో ఒకటిగా ఉండేవి . ఇప్పుడు ఆ వంకీలు ఫ్యాషన్ లో చేతి పట్టిల రూపంలో ఎన్నో రకాల ఆధునిక వస్త్రధారణల మీదకు ఉపయోగిస్తున్నారు . స్టీల్ ,సిల్వర్ ,ఎల్లో మెటల్ గవ్వలు లెదర్ లతో కూడా చక్కగా డిజైన్ చేస్తున్నారు ,పూవులు లతలు ,నెమళ్ళు సీతాకోక చిలుకలు ,పాములు గిరిజనులు వాడే పూసలు స్టోన్స్ తో కూడా చక్కని వంకీలు వస్తున్నాయి . స్టోన్స్ తో చేసిన చేతిపట్టిలు ఫ్యాషన్ జ్యువెలరీ లో భాగమై ఎంతో చౌకగా అందంగా అందరినీ అందుబాటు లోకి వచ్చేశాయి . ఒకప్పుడు ,బంగారు,వజ్రాలు విలువైన రాళ్ళు వుండే వంకీలు ఇప్పుడు వెండి రాగి వంటి మెటల్స్ తో ఇంకెంతో అందమైన డిజైన్ లలో వస్తున్నాయి .