Categories
ఎన్నో వన్నెల్లో గుండ్రని బంతి ఆకారంలో కనిపించే బొగడ బంతి పూలను గ్లోబ్ అమరాంధ్ అంటారు. కొమ్మలు రెమ్మలు ఎండినా పువ్వు మటుకు వాడకుండా రూపం పోకుండా ఉంటుంది. కనుకనే వీటిని నేచర్స్ సూపర్ ఫ్లవర్ గా చెబుతారు. జమైకా అమెరికాల్లో వీటిని బ్యాచిలర్ బటన్ అంటారు. ఈ పువ్వుల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాంపెరల్ అనే చర్మాన్ని రక్షించే గుణం కూడా ఉంది.ఫంగై, బ్యాక్టీరియా తో పోరాడే ఆంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఈ చిన్న పువ్వుతో టీ చేసుకుని తాగితే చాలా మంచిది. దగ్గు, జలుబు వంటి వైరస్ లను తగ్గిస్తుంది. ఈ టీ తాగితే జుట్టు కూడా తెల్లబడదు అంటున్నారు వైద్యులు. వందల పరిశోధనల్లో ఇది అపురూపమైన పుష్పం అని తేలింది.