Categories
ఎర్రని ఎరుపులో వగరుగా తియ్యగా ఉండే ఆల్ బఖరా పండ్లు ఈ సీజన్ లో బాగా వస్తాయి. ఈ పండ్లు శరీరాన్ని డీ టాక్సిఫై చేస్తాయి. చర్మం పట్టులా మృదువుగా అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. వయసు కనబడనీయవు. చర్మం బిగుతు కోల్పోకుండా ఉంటుంది. చర్మం పైన ముడతలు రావు. శరీరంలో జీవక్రియ, రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. ఈ పళ్ళలో పోటాషీయం చాలా ఎక్కువ. ఈ పండ్లలోని ఫ్లూయిడ్ కణాలకు శరీరానికి ఎంతో అవసరం. యాక్నే ముడతలు కనబడనీయవు. చర్మం కాంతీవంతంగా తయారవుతుంది. ఈ సీజనల్ పండి తినడం వలన శిరోజాలు వేగంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుంది. ఎన్నో రకాల శిరోజాల సమస్యలు తగ్గిపోతాయి.