చిన్న పార్టీలు ,పండగ సందర్భాల్లో తప్పని సరిగా బరువైన భోజనాలకు హాజరుకావాలసి ఉంటుంది.అలాంటప్పుడు ఆత్మీయులకు నో అనేసి బాధ పెట్టకుండా చిన్న ఛాయిస్ లతో స్మార్ట్ గా ప్రవర్తించచ్చు.కళ్ళ ఎదరుగా ఎన్నో రుచిగా ఉండే పదార్థాలు ఉంటాయి. అప్పుడు అత్యధిక కాలరీలున్న పదార్ధాల జోలికి పోకుండా ఆరోగ్యమైనవి ఎక్కువ తినాలి.ఏదైన మరీ బీజీగా ఆయిలీగా ఉంటే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అదనపు ఆయిల్ పీల్చేలాగా టిష్యూ నాప్ కీన్ వాడాలి. వీలైనంత వరకు లేక్ గ్రిల్ రోస్ట్ చేసిన పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఆరోగ్యాన్ని ఇస్తాయి, రుచిగా ఉంటాయి. సలాడ్ లేదా సూప్ తో ముందు భోజనం మొదలు పెట్టాలి. కొద్దిగా శ్రద్ధ తీసుకొని కొవ్వులు,కాలరీలు ఉండే పదార్ధాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తపడితే ఏ సందర్భన్ని మిస్ అవ్వక్కర్లేదు.
Categories