Categories
ఏదైన అతిగా చేస్తే అనర్ధమే. నిద్ర చాలకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో అతిగా నిద్రపోతే అంతకంటే ఎక్కువే ఇబ్బందులు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయే వారితో పోల్చితే పదిగంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే వారిలో అనారోగ్యకర లక్షణాలు కనపడతాయంటున్నారు. ఎక్కువ సేపు నిద్రపోతే గుండె సమస్యలు వస్తాయి. శరీరంలో చురుకుదనం లోపిస్తుంది. ముఖ్యంగా బరువు పెరుగుతారు. ఈ విషయంలో మగవారికంటే మహిళలకే ముప్పు ఎక్కువ అంటున్నారు. రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతాయి. టైప్-2 డయాబెటిస్ తప్పదు. అంతే కాదు మెదడు చురుకుదనం తగ్గి సమర్ధవంతంగా పని చేయలేకపోతుందని చెబుతారు.