Categories

గుజరాత్ లోని సూరత్ లో 11 వేల మంది మహిళలు ఒకేసారి డాన్స్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇన్ని వేలమంది సంప్రదాయ దుస్తులు ధరించి ఘూమర్ నృత్యం ప్రదర్శించారు. సామూహిక ఘూమర్ నృత్యం చేయడం కూడా ఇదే తొలిసారి ఈ సాంప్రదాయ నృత్యం ఈ గిన్నిస్ రికార్డ్ తో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. రాజస్థాన్ యువ సంఘ్ సూరత్ నిర్వహించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికపై జానపద కళను ప్రోత్సహించటం లక్ష్యంగా కొనసాగింది.