Categories
జీవన విధానం వల్లే చాలా మంది ఆడవాళ్ళలో వెన్ను నొప్పి సమస్య వస్తుంది అంటున్నారు వైద్యులు. రోజులో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడటం అప్పడు తల,మెడ వంగుతూ ఉండటం వల్ల మెడ కండరాలపై భారం పడుతోంది. ఆ ఒత్తిడి వెన్నుపై పడి సమస్య మొదలవుతోంది. అలాగే భుజానికి తగిలించుకొనే హాండ్ బ్యాగ్ లో ఎక్కువ వస్తువులు ఉండటం ,దాన్ని ఒకే వైపు తగిలించుకోవటం చాలా మంది అమ్మాయిల అలవాటు . ఈ బరువు ప్రభావం భుజం ఎముకలు కండరాలపై పడుతోంది. ఈ భారం వెన్నుకి చేరుతుంది. అలాగే అధిక బరువు పెరిగినా శరీరం బరువు భారం ,వెన్నుపై పడి కూడా వెన్నెముక నొప్పి వచ్చే అవకాశం ఉంది.