Categories
తమిళనాడు సమీపంలో శనీశ్వరాలయంకు అతి దగ్గరగా ఉన్న తిలతర్పణపురి దేవాలయాన్ని చూశారా మరి రండి ఆ దేవాలయం గొప్పతనం తెలుసుకుందాం.శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి దశరథునికి ఈ ప్రదేశంలో పిండ ప్రదానాలు చేశాడు అందుకే తిలతర్పణపురి అని పేరు వచ్చింది.తిల అంటే నువ్వులు.శ్రీరాముడు ఇక్కడ కొలనులో స్నానం ఆచరించి నాలుగు పిండాలు పెట్టాడు అవి క్రమేపి శివలింగాలుగా దర్శనం ఇస్తున్నాయి.విశేషం ఏమిటంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకు తొండము లేకుండా బాలగణపతి గా దర్శనం ఇస్తాడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు
-తోలేటి వెంకట శిరీష