వర్షాకాలపులోనే మొక్కజొన్న కండెలు బాగా వస్తాయి. వర్షంలో ఇది మంచి టైం పాస్ పుడ్. పైగా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో డైటరీ ఫైబర్ చాల ఎక్కువ. ఐరన్ లోపాలు తగ్గించి కొత్త రక్త కణాలు పుట్టేందుకు మొక్క జొన్న బాగా సహాయపడుతుంది. దాని పసుపు రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్ అ ను సమ కూర్చేందుకు అవసరమైన బీటు కెరాటీన్ ఉంటుంది. అందుకే ఈ ఆహారం చూపుని మెరుగుపరిచి వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులర్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. మెగ్నీషియం మంచి గుండె ఆరోగ్యాన్ని, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అరుదైన సేలినీయం పాళ్ళు మొక్కజొన్న లో పుశాకలంగా ఉన్నాయి.

Leave a comment