Categories
బంగారంలోని కొన్ని లవణాలతో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. కీళ్ల నొప్పులు, అటువంటి లక్షణాలు గల ఇతర అనారోగ్యాలు నయం చేసేందుకు బంగారం కలిపిన ఔషధాలు వాడుతారు. రక్త ప్రసరణను మెరుగు పరచటంలో కీళ్ళనొప్పుల వాపులు తగ్గించటంలో బంగారంలోని ఔషధగుణాలు బాగా పనిచేస్తాయి. అయితే బంగారంలోని లవణాలు రేడియో ఐసో టోపులు పార్మకలాజికల్ విలువలు కలసి ఉన్నాయి. లోహా రూపం లోని బంగారం శరీరంలోని రసాయనాలు ఎదుర్కొలేదు. ఇతర వినియోగాలు లేని పక్షంలో బంగారం వంటి లోహంతో సౌందర్య విలువలే అధికం. బంగారం నగలు ఇచ్చే అందం ప్రపంచంలో ఇంకే లోహాం ఇవ్వలేదు.