భోజనం స్పూన్లు ,పోర్క్ లతో కాకుండా చేత్తోనే తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి అంటున్నారు. చేత్తో భోజనం చేస్తుంటే మెదడు జీర్ణక్రియకు సంబంధించి సంకేతాలు పొట్టకు పంపుతుంది. అందువల్ల జీవక్రియలకు సంబంధించిన యాసిడ్స్ విడుదల అవుతాయి. ఎలాంటి ఆహారం ఎలా తింటున్నామన్న విషయాన్ని చేయి మెదడుకు చేరవేస్తుంది. చేతితో భొజనం చేయటం అంటే ఐదువేళ్ళను ముద్ర ప్రయోగంలాగా వాడుతాము అంటోంది. ఆయుర్వేదం ఒక్క వేలికి ఒక్కో అర్ధం, బొటన్ వేలు ఆకాశం ,చూపుడు వేలు గాలి ,మధ్యవేలు అగ్ని,ఉంగరపు వేలు నీటిని చిటికెన వేలు భూమిని సూచిస్తూ ఉంటుందట. ఇలా అన్ని వేళ్ళను కలుపుకొని ఆహారం తీపుకోవటం వల్ల మనం జీవితం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.

Leave a comment