ఇప్పుడు మార్కెట్ లో బంతి పూలు బాగా వస్తున్నాయి. ఇవి ఎంత అందమైన పువ్వుల్లో, ఏ దేకోరేషన్ కయినా ఎంత అందం ఇస్తాయో, అలాగే వీటితో తయ్యారు చేసే ఒక ఫేస్ ప్యాక్ అంతకంటే మంచి ఫలితం ఇస్తుంది. బంతిపూల రెక్కలు తెంపి వాటిని మెత్తగా పస్టులా చేసి, ఆ పేస్టులో పచ్చి పాలు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ తయ్యారు చేసి, ముఖానికి వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి గోరు వెచ్చని నీళ్ళ తో ముఖం కడిగేస్తే ముఖానికి పట్టులాంటి మెరుపు వస్తుంది.  అలాగే దానిమ్మ గింజల రసం తీసి అందులో కష్ట తేనె కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే, ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి  చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం సాగిపోకుండా చక్కగా వుంటుంది. రెగ్యులర్ గా వేసుకుంటే చర్మం పట్టులా మెరుస్తూ వయస్సు కనబడనీయదు.

Leave a comment