Categories
ఎక్కువ సమయం లాప్ టాప్ తో గడపడం, టీవి చూడటం, సినిమాలు చూడటం అంటే అడికబరువును కొనితెచ్చుకున్నట్లే అంటుంది. అంటారు ఎక్స్ పర్ట్స్. పైగా టీ వి చూస్తూ జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్ తాగడం అలవాటై పోతుంది. బంగాళ దుంప చిప్స్ వంటి రిఫైన్డ్ ఆహారాన్ని తినడం, ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గిపోతుంది. అలా కదలకుండా కూర్చోవడం అంటే నిద్రలో ఎక్కువ కాలరీలు శరీరం ఖర్చు చేస్తుంది. అటు ఎక్కువ సమయం నిద్ర పోక, ఇటు వ్యాయామం చేయక శరీరాన్ని అనారోగ్యం పాలు చేస్తున్నారని, కనీసం కాసేపు నడవడం, కుటుంబ సభ్యుల మధ్య గడపడం అయినా మంచిదే కనీ ఇలా కాలక్షేపం పనులతో నష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్.