ఎక్కువ బాషలను నేర్చుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకులు చెబుతున్నారు. భాషలు వస్తున్న కొద్ది మెదడు కణాల్లో సాగే గుణం పెరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. కొంతమంది విద్యార్ధులను ఈ పరిశోధనలోకి తీసుకుని విదేశీ భాషాల పదాలు నేర్చుకుంటున్న సమయంలో ఎలక్ట్రో ఎన్ సెఫలోగ్రాఫీ ద్వారా మెదడు కణాల పని తీరుని పరిశీలించారు. ఈ కణాల కదలిక ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు భాషను మాటను మర్చిపోతే వాళ్ళలో తిరిగి అవి తెప్పించే చికిత్స విధానానికి ఈ పరిశోధన ఉపయోగపడిందని చెబుతున్నారు. భాషలు నేర్చుకోవడం ఏ విధంగా చూసినా మెదడుకి శక్తినివ్వడమే కదా.

Leave a comment