Categories
వేసవి ప్రారంభం అయింది కనుక ఇక చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి దుమ్ము,దూళీ, చెమట వల్ల చర్మం పై మురికి పేరుకుపోకుండా తరచూ మొహం కడుక్కోవాలి. మృతకణాలు పోయేందుకు కీరదోస రసంలో నిమ్మరసం పిండి మొహానికి శుభ్రపరుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది వ్యర్థాలు టాక్సిన్లు బయటకు పోతాయి. సహజంగానే చర్మం తాజాగా తేమగా అనిపిస్తుంది. వాడుకునే సౌందర్య ఉత్పత్తుల్లో సిరా మైడ్, ఆక్వా గ్లిజరిన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఎండ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది కనుక సన్ స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.