Categories
చర్మం తెల్లబరుస్తాయని చెబుతూ మార్కెట్ లో విక్రయిస్తున్న ఎన్నో విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన మెర్క్యురీ ఉన్నట్లు ఢిల్లీ శ్రీ రామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనలు వెల్లడించాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రసాయనం వల్ల చర్మం అందంగా మారటం కన్నా జరిగే చేటే ఎక్కువ ఇది చర్మానికే కాక పలు రకాల అనారోగ్యాలకు కారణం అని తేల్చారు. ఇది నరాల వ్యవస్థ జీర్ణ వ్యవస్థను దెబ్బ తీయటం తో పాటు వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అని చెబుతున్నారు.