Categories
Soyagam

బ్యూటీ ఉత్పత్తుల్లో వజ్రాలు రత్నాలు.

వజ్రాలు, రత్నాలు క్రిస్టల్స్ జ్యూవెలరీ లోనే కాదు, బ్యూటి ఉత్పత్తులలో కూడా ఇన్ గ్రీడియంట్స్ లో ఇవి చోటు చేసుకుంటున్నాయి. ఫేషియల్, క్రీమ్స్ లో క్రిస్టల్ పీసెస్, క్రిస్టల్ స్టోన్స్ కలుస్తున్నాయి. వీటిల్లో చర్మానికి స్వాంతన ఇచ్చే గుణం వుంది. క్రిస్టల్స్ శరీరంలోని విశాపదర్దాలను బయటకి పంపేస్తాయి. వీటి వల్ల యాక్నే మచ్చలు పోతాయి. రఫ్ గా వుండే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. క్రిస్టల్స్ కణాలపై బాగా పని చేయడం వల్ల చర్మం చర్మం కాంప్లెక్షన్ లో కూడా మార్పు వస్తుంది. చర్మం లో మెరుపు కనబడుతుంది. క్రిస్టల్స్ లోని ఒక రకమైన రోజ్ క్వార్జ్ పొడి చర్మానికి చాలా మంచిది. రుబీ క్రిస్టల్స్ చర్మం పైన మృతకాణాలను పోగొట్టి మెరిసేలా చేస్తాయి. వజ్రాల పొడి బ్యూటీ ఉత్పత్తులలో వాడటం వల్ల చర్మం ముడతలు పడదు. చర్మం పైన మృతకణాలు పోయి చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది.

Leave a comment