Categories
టాన్ సమస్యకి ప్లోరల్ మాస్క్ లు బాగా పని చేస్తాయి . మల్లెల,మందారం,గులాబీ ,తామర వంటి పూలతో ఫేస్ ప్యాక్ తయారుచేసి వేసుకొంటే టాన్ పోతుంది . పొద్దుతిరుగుడు పువ్వులో ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది . టమాటాలోని లైకోసెనె చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది . పొద్దుతిరుగుడు పువ్వు మెత్తగా నూరి అందులో టమాటా గుజ్జు ,పచ్చిపాలు కలిపి పేస్టులా చేసి ఆ పేస్ట్ ను ఫ్రిజ్ లో ఉంచి చల్లాగ అయ్యాక ప్యాక్ వేసుకోవాలి . అలాగే మందారపూలు కూడా మొటిమలు ,మచ్చల్ని పోగొడతాయి మొహం మృదువుగా అవుతుంది . కప్పు నీళ్ళలో మందారపూలు వేసి రాత్రంతా ఆలా ఉంచి ఉదయాన్నే ఆ పూవుల్లో ఓట్స్ ,టి ట్రీ ఆయిల్ చుక్కలు వేసి పేస్ట్ లా చేసి పేస్ పాక్ వేసుకోవచ్చు .