మనం పూర్వికులు పాటించిన ఆహార పద్ధతులనే అనుసరించటం బెస్ట్ అంటారు ఎక్స్ పర్ట్స్. అలాగే తినే తిండి తో పాటు మనం ఆహారం వండే పద్ధతి కూడా మార్చుకోవాలంటున్నారు ,వంటకు అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్టీల్ పాత్రలు కొంత నయం కానీ మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆహార పదార్ధాల లోని ఆర్సెనిక్ ను,ఆ పాత్రా గ్రహిస్తుంది అందుకే మట్టి పాత్రలు వంటకు ఉత్తమం. అలాగే నల్ల నువ్వులు,ఆలివ్ గింజలు పల్లీలు వంటి వాటితో తయారైన వంట నూనెలు చాలా మంచివి. అలాగే రాగులు సజ్జలు,జొన్నలు కొర్రలు ఒరిగెలు వంటి తృణ ధాన్యాలు కూడా ఆహారంలో భాగంగా ఉపయోగించాలి అంటున్నారు.

Leave a comment