బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని గుజ్జుగా చేసి అందులో నాలుగు చుక్కల బాదం నూనె చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం నిగారింపుగా ఉంటుంది. బీట్ రూట్ గుజ్జులో రెండు స్పూన్ల ముల్తానీ నత్తి చెంచా నిమ్మ రసం కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవచ్చు, అరకప్పి పెరుగులో చిటికెడు పసుపు కొద్దిగా బీట్ రూట్ గుజ్జు కలిపి పదినిమిషాలు ఆగి శుభ్రం చేయూస్కుంటే చర్మం టైట్ గా కనిపిస్తుంది. బీట్ రూట్ రసం కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూది ముంచి మొహం శుభ్రం చేసుకోవచ్చు. ఇదే రసంలో నిమ్మరసం కూడా కలుపుకుంటే పిగ్మెంటేషన్ దూరం అవుతుంది. సెనగపిండి బీట్ రూట్ రసం మెత్తగా చేసిన గులాబీ రేకుల మిశ్రమం కలిపి రాసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.
Categories
Soyagam

బీట్ రూట్ పూతతో గులాబీ రేకుల అందం

Leave a comment