Categories
ఎర్రని దానిమ్మ గింజలు అందానికి మెరుగులు దిద్దుతాయి అంటున్నారు బ్యూటీ ఎక్సపర్ట్స్. రెండు స్పూన్ల దానిమ్మ రసంలో టేబుల్ స్పూన్ వెన్న,తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది.దానిమ్మ రసం పెరుగు కలిపిన మిశ్రమం కూడా చర్మ ఛాయను పెంచుతుంద.అలాగే దానిమ్మ రసం లో కలబంద గుజ్జు కలిపి ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేస్తే కలబంద లోని పోషకాలు చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి .వయసు పైబడటం వల్ల ముఖంలో వచ్చే మార్పులు నియంత్రిస్తాయి.