సామాజిక కార్యకర్త పద్మినీ వార్కి పేరిట ఏటేటా ఇచ్చే పురస్కారం అందుకుంది ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా ప్రశంసలు పొందిన దీపా జోసఫ్. కుటుంబ బాధ్యతలు తీర్చేందుకు గాను డ్రైవింగ్ నేర్చుకుని వ్యాన్ డ్రైవర్ ఉద్యోగం చేసే దీప కోవిడ్ సమయంలో కోజికోడ్ లోని ప్రణవం ట్రస్ట్ కు అంబులెన్స్ డ్రైవర్ గా చేరారు. ఈ ఏడాది కాలంలో ఎందరో రోగులను సకాలంలో హాస్పిటల్ కు చేర్చిన దీపా మూడుసార్లు కోవిడ్ బారినపడి కోలుకున్నది. నాకు వచ్చిన పురస్కారాలు నేను చేసిన పనికి గుర్తింపు గా భావిస్తున్నాను అంటుంది దీపా జోసఫ్.

Leave a comment